అనిరుధ్‌కు విజయ్ సర్‌ప్రైజ్!

అనిరుధ్‌కు విజయ్ సర్‌ప్రైజ్!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో కీలకంగా నిలవబోతున్న భారీ చిత్రం ‘కింగ్డమ్’. ఈ మూవీలో విజయ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాకి కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో కీలకంగా నిలవబోతున్న భారీ చిత్రం ‘కింగ్డమ్’. ఈ మూవీలో విజయ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాకి కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కగా.. ఇప్పుడు మరింతగా ప్రమోషన్స్‌కు గేర్‌అప్ అయ్యారు మేకర్స్. లేటెస్ట్ గా 'కింగ్డమ్ బాయ్స్ మీట్' పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ, అనిరుధ్, గౌతమ్ తిన్ననూరి కలిసి సందడి చేస్తూ కనిపించారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ నుండి ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీ షర్ట్‌లను, అలాగే తను ఉపయోగించిన షటిల్ బ్యాట్‌ను అనిరుధ్‌కి గిఫ్ట్‌గా అందజేయడం విశేషం. ఈ వీడియోని 'కింగ్డమ్' ప్రమోషన్స్ లో 'ఎపిసోడ్ 1'గా షేర్ చేశాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.

ఇదే సమయంలో అనిరుధ్ 'కింగ్డమ్' గురించి పాజిటివ్ హైప్ క్రియేట్ చేస్తూ, సినిమా చూశాను చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. అలాగే విజయ్ దేవరకొండతో పని చేయాలన్న తన చిరకాల కోరిక తీరిందంటూ అనిరుధ్ వ్యాఖ్యానించాడన్న ప్రచారం కూడా నడుస్తోంది.

మొత్తంగా విజయ్ దేవరకొండ – గౌతమ్ – అనిరుధ్ కలయికతో 'కింగ్డమ్' చిత్రం, తెలుగు సినిమాకు మరో కొత్త శైలిని పరిచయం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తోన్న 'కింగ్డమ్' జూలై 4న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది.



Tags

Next Story