బన్నీకి విజయ్ స్పెషల్ గిఫ్ట్!

బన్నీకి విజయ్ స్పెషల్ గిఫ్ట్!
X
పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల మధ్య గాఢమైన స్నేహ బంధం మరోసారి చర్చనీయాంశమైంది.

పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల మధ్య గాఢమైన స్నేహ బంధం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల విజయ్, హైదరాబాద్‌లో తన ‘రౌడీ’ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా, బన్నీకి ప్రత్యేకమైన రౌడీ దుస్తులు, ఆయన పిల్లల కోసం మినీ బర్గర్లు గిఫ్ట్‌గా పంపించాడు.

ఈ సర్ప్రైజ్‌పై అల్లు అర్జున్ ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ, 'మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్ చేస్తుంటావు' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిలో స్పందించాడు. గతంలో 'పుష్ప 2' సందర్భంగా కూడా విజయ్ ప్రత్యేకంగా 'పుష్ప' టీషర్టులు బన్నీకి పంపించి తన ప్రేమను చాటాడు.

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతుండగా, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్‌డమ్’ రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత రవి కిరణ్‌ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్థన్', రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో మరో మూవీని లైన్లో పెట్టాడు రౌడీ స్టార్.

Tags

Next Story