మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న విజయ్ సేతుపతి

మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న విజయ్ సేతుపతి
X

మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న విజయ్ సేతుపతితమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి తన దాతృత్వాన్ని మరోసారి చాటు కున్నారు. ఆయన ఇప్పటికే ఎన్నో మానవతా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) కార్మికుల కోసం చెన్నైలో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ విరాళం అందజేశారు.

ఈ భవనాన్ని "విజయ్ సేతుపతి టవర్స్" అని నామకరణం చేయనున్నారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ఫెఫ్సీ లో సుమారు 23 సంఘాలకు చెందిన 25,000 మంది సభ్యులు పనిచేస్తున్నారు. వీరంతా టీవీ అండ్ సినిమా పరిశ్రమల్లో వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు.

తమిళ నటుడు, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుమారుడు అయిన ఉధయనిధి స్టాలిన్.. వివిధ సినీ సంస్థలకు భూమి పునరుద్ధరణ లీజును మంజూరు చేశారు. ఇందులో ఫెఫ్సీతో పాటు, తమిళనాడు బుల్లి తెర నటుల సంఘం, దక్షిణ భారత నటుల సంఘం, తమిళ సినీ నిర్మాతల మండలి వంటి సంస్థలు ఉన్నాయి.

విజయ్ సేతుపతి కెరీర్ విషయానికి వస్తే.. 2024 అతనికి ఎంతో ముఖ్యమైన సంవత్సరం. ఆయన 50వ చిత్రం "మహారాజా" థియేటర్లలో మరియు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విశేషంగా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే, ఆ సంవత్సరంలోనే విడుదలైన "విడుదలై పార్ట్ 2" చిత్రం బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు సాధించినప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Tags

Next Story