విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ వివరణ!

విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ వివరణ!
X
హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేశాడనే రూమర్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో, ఆయన పీఆర్ టీమ్ దీనిపై స్పష్టతనిచ్చింది.

హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేశాడనే రూమర్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో, ఆయన పీఆర్ టీమ్ దీనిపై స్పష్టతనిచ్చింది. విజయ్ దేవరకొండ కేవలం చట్టబద్ధమైన స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రచారం చేశారని, ఆయా కంపెనీలు లీగల్‌గా పని చేస్తున్నాయని వివరించారు.

ఎవరికైనా బ్రాండ్ అంబాసిడర్‌గా మారే ముందు, ఆ సంస్థ చట్టబద్ధంగా నడుస్తుందో లేదో ఆయన టీమ్ పూర్తిగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ గతంలో ఏ 23 అనే స్కిల్ బేస్డ్ రమ్మీ గేమింగ్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఈ గేమ్‌ను గౌరవనీయ సుప్రీం కోర్టు కూడా స్కిల్ బేస్డ్ గేమ్‌గా గుర్తించిందని టీమ్ తెలిపింది.

అయితే, విజయ్ దేవరకొండ-ఏ 23 మధ్య ఒప్పందం గత ఏడాది ముగిసింది. ప్రస్తుతం ఆ సంస్థతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. కొన్ని మీడియా వర్గాల్లో ప్రచారమవుతున్న విజయ్ దేవరకొండపై ఈ రూమర్లు అసత్యమని, ఆయన ఎప్పుడూ చట్ట విరుద్ధమైన సంస్థలకు ప్రచారం చేయరని టీమ్ తేల్చి చెప్పింది.

Tags

Next Story