విజయ్-భాగ్యశ్రీ రొమాంటిక్ కెమిస్ట్రీ!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటేనే యూత్ ఫేవరెట్ స్టార్. ముఖ్యంగా రొమాంటిక్ హీరోగా విజయ్ కి మంచి క్రేజ్ ఉంది. 'అర్జున్ రెడ్డి, గీత గోవిందం' చిత్రాల్లో విజయ్ రొమాంటిక్ అవతార్ ను ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మళ్లీ 'కింగ్డమ్' కోసం యాక్షన్ తో పాటు రొమాన్స్ లోనూ అదరగొట్టబోతున్నాడు దేవరకొండ.
'కింగ్డమ్' నుంచి 'హృదయం లోపల' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ఈరోజే రాబోతుంది. సాయంత్రం 4.06 నిమిషాలకు ఈ పాటను విడుదల చేయబోతున్నట్టు 'కింగ్డమ్' నిర్మాత, సితార అధినేత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ కంపోజిషన్ లో రూపొందిన ఈ పాటలో లీడ్ పెయిర్ విజయ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఓ రేంజులో ఉండబోతున్నట్టు ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'కింగ్డమ్' నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషలకు సంబంధించిన అగ్ర తారల వాయిస్ ఓవర్స్ తో ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. మే 30న 'కింగ్డమ్' భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతుంది.
#HridayamLopala Full Video song will be etched into your hearts from 4:06 PM, Today❤️
— Naga Vamsi (@vamsi84) May 2, 2025
An @anirudhofficial vibe ❤️🔥 #Kingdom
pic.twitter.com/2pkHYho4qv
-
Home
-
Menu