ప్రతిష్ఠాత్మక చిత్రంతో వస్తోన్న విజయ్ ఆంటోని!

ప్రతిష్ఠాత్మక చిత్రంతో వస్తోన్న విజయ్ ఆంటోని!
X
విలక్షణమే ప్రధానంగా సాగే కథానాయకులు కొంతమంది ఉంటారు. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ కొత్త కథలను పరిచయం చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి హీరోల్లో ముందు వరుసలో నిలుస్తాడు విజయ్ ఆంటోని.

విలక్షణమే ప్రధానంగా సాగే కథానాయకులు కొంతమంది ఉంటారు. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ కొత్త కథలను పరిచయం చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి హీరోల్లో ముందు వరుసలో నిలుస్తాడు విజయ్ ఆంటోని. తాజాగా విజయ్ ఆంటోని తన 25వ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం తెలుగులో ‘పరాశక్తి‘ పేరుతో రాబోతుంది.


విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్ ఆంటోని లుక్ ఆకట్టుకుంటుంది. చేతిలో గన్ పట్టుకుని.. ఏదో లక్ష్యాన్ని చేధించే వాడిలో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు విజయ్. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీయే సంగీతాన్ని సమకూరుస్తుండడం విశేషం. ఇటీవల పొంగల్ బరిలో విడుదలైన ‘మదగజరాజా‘ చిత్రానికి విజయ్ ఆంటోని అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయ్యింది. మొత్తంగా ఈ ఏడాది వేసవి బరిలో విజయ్ ఆంటోని ‘పరాశక్తి‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Tags

Next Story