విద్యాబాలన్ రూమర్స్ కి చెక్

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2'కి సంబంధించి క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్ గా బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది.
విద్యా బాలన్ గతంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో, బసవతారకం పాత్రను చక్కగా పోషించి ప్రశంసలు అందుకుంది. బాలయ్యతో ఆమె జోడీ బాగా కుదిరిందని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. దీంతో ‘అఖండ 2’లో ఆమె మరోసారి కనిపించబోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ, ఈ వార్తల్లో నిజం లేదట. ‘అఖండ 2’లో విద్యా బాలన్ నటించడం లేదని ఆమె టీమ్ చెబుతుంది.
ఇక ‘అఖండ 2’ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. మొదటి భాగం హిందీలో మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో, ఈసారి బాలీవుడ్, ఇతర భాషల నుంచి నటులను తీసుకుంటున్నారు. అందులో భాగంగానే విద్యా బాలన్ పేరు వినిపించింది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో సంయుక్త మీనన్, ప్రగ్య జైస్వాల్, శోభన వంటి వారు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. లేటెస్ట్‌గా అన్నపూర్ణ స్టూడియోలో కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతుంది 'అఖండ 2'.
-
Home
-
Menu