తెలుగులో ‘పట్టుదల‘గా వస్తోన్న ‘విడాముయర్చి‘

X
తెలుగులో ‘పట్టుదల‘గా వస్తోన్న ‘విడాముయర్చి‘అసలు కోలీవుడ్ పొంగల్ రేసులో విడుదలవ్వాల్సిన అజిత్ ‘విడాముయర్చి‘ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అజిత్ కి జోడీగా త్రిష నటించగా.. ఇతర కీలక పాత్రల్లో అర్జున్, రెజీనా కనిపించబోతున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మగిళ్ తిరుమేని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తమిళంలో ‘విడాముయర్చి‘గా వస్తోన్న ఈ సినిమాకి తెలుగు టైటిల్ గా ‘పట్టుదల‘ను నిర్ణయించారు. ఈ రోజు అజిత్ ‘పట్టుదల‘ ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ తోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.
Next Story
-
Home
-
Menu