బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న వెంకీమామ!

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు ఊపేస్తోంది.
రిలీజ్ అయిన తొలి రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. నాలుగు వారాలు పూర్తయినా క్రేజ్ తగ్గకుండా థియేటర్ల వద్ద భారీ రష్ కొనసాగుతోంది. ముఖ్యంగా బుక్ మై షోలో ఈ సినిమా 3.5 మిలియన్ టికెట్ బుకింగ్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
విడుదలైన 20వ రోజున కూడా ఆల్‌టైమ్ హైయ్యస్ట్ గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా 'సంక్రాంతికి వస్తున్నాం' నిలిచినట్టు ఓ పోస్టర్ వేసింది టీమ్. ఫిబ్రవరి 7న 'తండేల్' వచ్చే వరకూ థియేటర్లలో మరో పెద్ద సినిమా ఏదీ లేదు. మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.
-
Home
-
Menu