వెంకీ-త్రివిక్రమ్ సినిమా ఫిక్స్!

వెంకీ-త్రివిక్రమ్ సినిమా ఫిక్స్!
X
చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న కాంబో వెంకటేష్-త్రివిక్రమ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచనలో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న కాంబో వెంకటేష్-త్రివిక్రమ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచనలో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పటికీ ఈ చిత్రాలకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యిందట.

ఈ సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు వెంకీ. ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకటేష్ నెక్స్ట్ మూవీని ఇంకా అనౌన్స్‌ చేయలేదు. లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం వెంకీ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ తోనే చేయబోతున్నాడట.

అసలు త్రివిక్రమ్.. తన నెక్స్ట్ మూవీని అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. అయితే.. అల్లు అర్జున్ సినిమా మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కనుంది. దీంతో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కోసం మరో సంవత్సరమైనా సమయం పడుతుంది. ఈలోపులో వెంకటేష్ మూవీని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట మాటల మాంత్రికుడు.

వెంకీ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతుందని టాక్. త్రివిక్రమ్ స్టైల్ లో కామెడీకి పెద్ద పీట వేస్తూనే.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందనుందట. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

Tags

Next Story