'వీరమల్లు' ప్రీ రిలీజ్ అతిథులు!

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెరపైకి వస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఇది పవర్‌స్టార్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం కూడా కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ లో 17వ శతాబ్దానికి సంబంధించిన కల్పిత పాత్ర ‘వీరమల్లు’ చుట్టూ ఈ సినిమా కథ సాగనుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హిందుత్వ భావజాలానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో, సినిమాలోని వీరమల్లు పాత్రను హిందూ ధర్మాన్ని పరిరక్షించే యోధుడిగా డిజైన్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక జూలై 21న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ తో పాటు.. కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేను ఆహ్వానించారట.
పవన్ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో అతిథిగా హాజరుకానున్నారట. జూలై 24న 'హరి హర వీరమల్లు' గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంది. మరి.. భారీ అంచనాలతో వస్తోన్న వీరమల్లు ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
-
Home
-
Menu