‘వీరమల్లు‘ విడుదలపై మరోసారి ఉత్కంఠ!

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు‘ మరోసారి వాయిదా పడబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే వాయిదాల పర్వం కొనసాగిస్తూ వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ మార్చుకోనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
వచ్చే మే 9 ‘హరిహర వీరమల్లు‘ విడుదలవుతోందని ప్రకటించారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం, ఆ తేదీకి కూడా రాకపోవచ్చని అంటున్నాయి సినీ వర్గాలు. రెండు భాగాలుగా రానున్న ‘హరిహర వీరమల్లు‘ ఫస్ట్ పార్ట్ లో పవన్ కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉంది. పవన్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో.. రెండో భాగానికి సంబంధించి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ జ్యోతికృష్ణ.
ఏప్రిల్ చివరిలో పవన్ సెట్స్ లోకి రావాలని భావిస్తున్నప్పటికీ, రాజకీయాల్లో ఆయన బిజీగా ఉండటం, ఆరోగ్య సమస్యలు వంటి కారణాలతో షూటింగ్ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి వంటి తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
-
Home
-
Menu