ఏపీ భవన్‌లో 'వీరమల్లు' ప్రదర్శనలు!

ఏపీ భవన్‌లో వీరమల్లు ప్రదర్శనలు!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాని ప్రత్యేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌ లో ప్రదర్శిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాని ప్రత్యేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌ లో ప్రదర్శిస్తున్నారు. ఈరోజు (జూలై 26), రేపు (జూలై 27) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు.

ఈ ప్రదర్శనను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ అధికారికంగా ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న తెలుగు ఉద్యోగులు, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఈ రోజు షోకి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఆదివారం సాయంత్రం జరిగే రెండవ ప్రదర్శనకు టికెట్లు ముందుగానే రిజర్వ్ కావడం విశేషం. ఆదివారం సాయంత్రం 4 గంటలకు షో వేయనున్నారు.

Tags

Next Story