'వీరమల్లు' న్యూ రిలీజ్ డేట్?

వీరమల్లు న్యూ రిలీజ్ డేట్?
X
ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడిన 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేసుకునే పనిలో ఉంది. ఈసారి సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో.. ఖచ్చితంగా ఆడియన్స్ ముందుకు వస్తుందనే అంచనాలున్నాయి.

ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడిన 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేసుకునే పనిలో ఉంది. ఈసారి సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో.. ఖచ్చితంగా ఆడియన్స్ ముందుకు వస్తుందనే అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా కోసం సరైన రిలీజ్ డేట్ ఇప్పుడు మేకర్స్ ముందు ఉన్న సవాల్.

పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ రాబోతున్న ఈ చిత్రం కోసం పలు తేదీలను పరిశీలించారట మేకర్స్. ఫైనల్ గా జూన్ 13న 'వీరమల్లు' వచ్చే అవకాశాలున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం. ఇప్పటికే బిజినెస్ డీల్స్‌ను ఫైనల్ చేయాల్సిన నేపథ్యంలో స్పష్టమైన విడుదల తేదీ అవసరమయ్యింది. ముందు జూన్ తొలి వారం అనుకున్నా, సమయాభావం వల్ల రెండో వారం తీసుకున్నట్లు తెలిసింది.

ఈ డేట్‌ను పరిశీలిస్తే ఇది వ్యూహాత్మకంగానే అనిపిస్తుంది. జూన్ మొదటి వారంలో కమల్ హాసన్ 'తగ్ లైఫ్', మూడో వారంలో 'కుబేర', నాల్గవ వారంలో 'కన్నప్ప' రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇక రెండో వారంలో అయితే ఎలాంటి పోటీ ఉండదు.. వేరే సినిమాలకూ ఇబ్బంది ఉండదు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ కట్ జరుగుతుందట. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా పలు ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు.

Tags

Next Story