ఓపెనింగ్ రికార్డ్స్‌ కోసం 'వీరమల్లు'

ఓపెనింగ్ రికార్డ్స్‌ కోసం వీరమల్లు
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చివరికి అన్ని ఆటుపోట్లు దాటుకుని విడుదలకు సిద్ధమవుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జ్యోతికృష్ణ - క్రిష్ దర్శకులుగా పని చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చివరికి అన్ని ఆటుపోట్లు దాటుకుని విడుదలకు సిద్ధమవుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జ్యోతికృష్ణ - క్రిష్ దర్శకులుగా పని చేశారు. ఐదేళ్లుగా వాయిదాల మధ్య నిలిచిన ఈ పీరియాడికల్ డ్రామా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

విడుదల ముందు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ సమస్యలు తలెత్తగా, ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగడంతో పరిస్థితి కుదుటపడింది. దీంతో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో రిలీజ్‌కు మార్గం సుగమమైంది. ఉత్తరాంధ్రలో అయితే ఈ చిత్రం 150 థియేటర్లకు 135 థియేటర్లలో రిలీజ్ అవుతుండటం విశేషం. మొదటి వారం కూడా 125 స్క్రీన్‌లపై సినిమా కొనసాగనుంది.

ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్రలో నటించాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్నందించగా, జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సమకూర్చారు.

సినిమాపై ఉన్న అంచనాలు, ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే, ఈసారి పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓ ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. విడుదలకు ముందు హైప్, ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఫ్యాన్స్‌ మధ్య ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి పెరిగింది.

Tags

Next Story