‘విడి 12’ టైటిల్ లాక్.. మాస్ ఫీస్ట్ లోడింగ్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి ఇప్పుడొక కల్ట్ హిట్ కావాలి. ‘అర్జున్ రెడ్డి‘ తరహాలో మరొకసారి దేశాన్ని ఊపేయాలి. ఇక విజయ్ దేవరకొండ నుంచి అలాంటి కల్ట్ క్వాలిటీస్ ఉన్న చిత్రంగా ‘విడి 12‘పై భారీ అంచనాలున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం టీమ్ ఎంతో కష్టపడుతుందట.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ నెవర్ బిఫోర్ గా రస్టిక్ గా ఉండబోతుందట. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు విజయ్ దేవరకొండ రాత్రింబవళ్లు కృషి చేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. లేటెస్ట్ గా ‘విడి 12‘ టైటిల్ గురించి క్రేజీ అప్డేట్ అందించారు నిర్మాత నాగవంశీ. ‘మీ అందరి అబ్యూసెస్ తర్వాత నేను గౌతమ్ ని చాలా హింస పెట్టాక.. ఫైనల్లీ వియ్ హ్యావ్ లాక్డ్ ది టైటిల్‘ అంటూ ‘విడి 12‘ టైటిల్ ను త్వరలోనే రివీల్ చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఈ ఏడాదిలోనే అలరించడానికి సిద్ధమవుతోన్న విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ లో నటించే ఇతర నటీనటుల గురించి తెలియాల్సి ఉంది.
https://x.com/vamsi84/status/1885176828576637274
-
Home
-
Menu