వరుణ్ మరో కొత్త ప్రయోగం!

హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేయడంలో ముందుంటాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈకోవలోనే ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ 15వ చిత్రంగా ప్రచారంలో ఉన్న ఈ మూవీకి 'కొరియన్ కనకరాజు' అనే వెరైటీ టైటిల్ పరిశీలనలో ఉంది. యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకోవడం.. షూటింగ్ మొదలు పెట్టుకోవడం జరిగింది.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తుంది. గతంలో 'అశోకవనం లో అర్జున కళ్యాణం' చిత్రంలో విశ్వక్ సేన్ సరసన క్యూట్ రోల్ లో మెరిసింది రితిక. ప్రస్తుతం తేజ సజ్జ నటిస్తున్న 'మిరాయ్'లోనూ నాయికగా నటిస్తుంది.
వరుణ్ తేజ్ 15 కోసమే లొకేషన్స్ హంటింగ్ కోసం ఆమధ్య వియత్నాం కూడా తిరిగొచ్చింది టీమ్. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న వరుణ్ కి.. మేర్లపాక ఈ సినిమాతో హిట్ ఇస్తాడేమో చూడాలి.
-
Home
-
Menu