వియత్నాంలో విహరిస్తున్న వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వియత్నాంలో విహరిస్తున్నాడు. అయితే ఏదో వెకేషన్ కోసం వియత్నాం వెళ్లలేదు. తన అప్ కమింగ్ మూవీ స్టోరీ డిస్కషన్స్ కోసం వియత్నాం వెళ్లాడు. వరుణ్ తేజ్ తో పాటు, దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాతలు వంశీ, రాజీవ్ రెడ్డి వియత్నాంలో వరుణ్ తేజ్ 15వ సినిమాకి సంబంధించి స్టోరీ డిస్కషన్స్ లో బిజీగా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈమధ్య వరుస ఫ్లాపులతో సతమతమైన వరుణ్ తేజ్.. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇండో కొరియన్ హారర్ కామెడీగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడట మేర్లపాక గాంధీ. ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు‘ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వియత్నాంలో స్టోరీ డిస్కషన్స్ తో పాటు పనిలో పనిగా లొకేషన్స్ హంటింగ్ కూడా కొనసాగిస్తుంది టీమ్. మార్చి మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు పెట్టుకునే ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
-
Home
-
Menu