ప్రేమికుల రోజు.. చిన్న సినిమాలు, పెద్ద ఆశలు!

ప్రేమికుల రోజు.. చిన్న సినిమాలు, పెద్ద ఆశలు!
X
ఫిబ్రవరి 14న ప్రేమికులరోజును టార్గెట్ చేస్తూ పలు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి. వీటిలో 'లైలా, దిల్‌రూబా, బ్రహ్మ ఆనందం, వంటి సినిమాలున్నాయి.

సంక్రాంతి సందడి తర్వాత మళ్లీ ఫిబ్రవరిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాల సందడి మొదలవ్వబోతుంది. అసలు ఫిబ్రవరి 6, 7 తేదీల్లోనే 'పట్టుదల, తండేల్' వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త కళ మొదలవ్వనుంది. ఫిబ్రవరి 6న అజిత్ లాంగ్ పెండింగ్ మూవీ 'పట్టుదల' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తర్వాత ఒక్క రోజుకే నాగచైతన్య పాన్ ఇండియా మూవీ 'తండేల్' వస్తోంది. 'పట్టుదల, తండేల్' చిత్రాల మధ్య తెలుగు, తమిళం భాషల్లో బాక్సాఫీస్ క్లాష్ రంజుగానే సాగనుంది.

మరోవైపు ఫిబ్రవరి 14న ప్రేమికులరోజును టార్గెట్ చేస్తూ పలు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి.వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది 'లైలా'. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటించిన సినిమా ఇది. ఇటీవలే రిలీజైన 'లైలా' టీజర్ ఆకట్టుకుంది. అంతకుముందు కొంతమంది హీరోలు లేడీ గెటప్స్ లో అలరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాలో లేడీగా విశ్వక్ సేన్ ఎలా అలరిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా 'లైలా' ఆడియన్స్ ముందుకు వస్తోంది.

'క' విజయంతో మంచి ఫామ్ లో ఉన్న కిరణ్ అబ్బవరం.. ఈసారి 'దిల్ రుబా' అంటూ ఫుల్ లెన్త్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. కిరణ్ కి జోడీగా రుక్సార్ థిల్లాన్ నటిస్తుంది. ఈ చిత్రానికి విశ్వ కరుణ్ డైరెక్టర్. సామ్ సి.ఎస్. సంగీతంలో లేటెస్ట్ గా 'అగ్గిపుల్లే' అంటూ సాగే సాంగ్ రిలీజయ్యింది. వాలెంటైన్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న 'దిల్ రూబా' రాబోతుంది.

బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రహ్మా ఆనందం' కూడా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి అప్లాజ్ వచ్చింది. ఇంకా కమెడియన్ ధనరాజ్ డైరెక్ట్ చేస్తోన్న 'రామం రాఘవం' ప్రేమికులరోజు వీక్ లోనే విడుదలకు సిద్ధమవుతుంది.

Tags

Next Story