వడ్డే నవీన్ రీఎంట్రీ

వడ్డే నవీన్ రీఎంట్రీ
X
టాలీవుడ్‌లో ఒకప్పుడు పేరున్న కథానాయకుల్లో వడ్డే నవీన్ ఒకడు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించాడు.

టాలీవుడ్‌లో ఒకప్పుడు పేరున్న కథానాయకుల్లో వడ్డే నవీన్ ఒకడు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించాడు. ‘కోరుకున్న ప్రియుడు‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘పెళ్లి, మనసిచ్చి చూడు, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది‘ వంటి హిట్‌ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. అయితే.. సడెన్ గా సినిమాల నుంచి గ్యాస్ తీసుకున్నాడు నవీన్.

చాన్నాళ్లుగా వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ వస్తూనే ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు అది నిజమైంది. వడ్డే నవీన్ హీరోగా ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు‘ పేరుతో సినిమా రాబోతుంది. ఇందులో పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని వడ్డే క్రియేషన్స్ పై నవీన్ స్వయంగా నిర్మిస్తుండటం మరో విశేషం. కమల్ తేజ్ నార్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలో వెల్లడించనున్నారట.



Tags

Next Story