'ఉస్తాద్..' మ్యూజికల్ ఫెస్ట్!

ఉస్తాద్.. మ్యూజికల్ ఫెస్ట్!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' తరహాలోనే ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించనున్నాడు.

శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత పనులు మొదలుపెట్టినట్టు వెల్లడించాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పవన్ కళ్యాణ్ కి మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది.

ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Tags

Next Story