‘ఉస్తాద్..‘ ఒరిజినల్ స్టోరీ!

‘ఉస్తాద్..‘ ఒరిజినల్ స్టోరీ!
X
ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నా.. గతంలో ఆగిపోయిన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈకోవలోనే ‘హరిహర వీరమల్లు, ఓజీ‘లతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ను కూడా తిరిగి పట్టాలెక్కిస్తున్నాడు.

అయితే.. మొన్నటివరకూ ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ తమిళ చిత్రం ‘తేరి‘ రీమేక్ గా తెరకెక్కుతోంది అనే ప్రచారం జరిగింది. దీనిపై ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ఈ సినిమాని ఇప్పుడు సరికొత్త కథతో తెరకెక్కించనున్నాడట డైరెక్టర్ హరీష్ శంకర్. ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలను అలాగే ఉంచేసి.. ఆ సీన్స్ కు కనెక్టివిటీతో ఓ కొత్త కథను రూపొందించాడట.

లేటెస్ట్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ సినిమా షూటింగ్ బిగిన్స్ అంటూ ఓ పోస్టర్ ను వదిలింది టీమ్. అంటే పాత కథకు ఎలాంటి సంబంధం లేకుండా మళ్లీ కొత్త కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని హింట్ ఇచ్చిందన్నమాట.

జూన్‌ నుంచి ‘ఉస్తాద్.. ‘ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీలో పవన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది.

Tags

Next Story