రజనీని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఉపేంద్ర

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ'. ఈ చిత్రంలో నాగార్జున, అమిర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్ వంటి స్టార్స్ కనిపించనున్నారు. ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘కూలీ‘ ప్రమోషన్లు జోరందుకున్నాయి.
లేటెస్ట్ ప్రమోషన్లలో దర్శకుడు లోకేష్ ‘కూలీ‘ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రజనీకాంత్‌ను ఫస్ట్ డే షూటింగ్‌లో చూసినప్పుడు హీరో ఉపేంద్ర కొన్ని నిమిషాల పాటు ఎమోషన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పాడు. ఉపేంద్రకు చిన్నప్పటి నుంచీ రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని.. అతనితో పనిచేసే అవకాశం రావడంతోనే ఆయన ఎమోషన్ అయ్యారని లోకేష్ అన్నాడు.
మరోవైపు ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా కనిపించనున్నారని హీరోయిన్ శ్రుతి హాసన్ చెప్పింది. ఆయన నటనను చూసి షాక్ అయ్యానని, తెలుగు ప్రేక్షకులకు ఇది ఓ మాస్ ట్రీట్ అవుతుందని వ్యాఖ్యానించింది శ్రుతి. మొత్తానికి క్రేజీ స్టార్ కాస్ట్ తో పాటు లోకేష్ స్టైల్, టేకింగ్ ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్తాయని ఇప్పటికే సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.
-
Home
-
Menu