పవన్ సినిమాలపై కొనసాగుతున్న అనిశ్చితి!

పవన్ కళ్యాణ్ సినిమాలపై కొనసాగుతున్న అనిశ్చితి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.ప్రస్తుతం పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. ఆ చిత్రాలు తొందరగా పూర్తి చేసి విడుదల చేస్తే చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. పవర్‌స్టార్ కేవలం కొన్ని కాల్షీట్స్ మాత్రం ఇస్తే సరిపోతుందని.. తమ సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకుంటామని నిర్మాతలు కూడా ఎదురు చూస్తున్నారు.
పవన్ కిట్టీలో ఉన్న మూడు సినిమాలలో 'ఉస్తాద్ భగత్ సింగ్'ను పక్కనపెడితే ‘హరిహర వీరమల్లు, ఓజీ’ లను ముందుగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ కళ్యాణ్ ఒక వారం రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుందట. ఒకవేళ అది అనుకున్న సమయానికి పూర్తైతే ఈ సినిమా మార్చి 28న రావడం కన్ఫమ్ అని తెలుస్తోంది.
మరోవైపు ‘ఓజీ’లో కూడా పవన్ పార్ట్ కు సంబంధించి కొంత వర్క్ మాత్రమే పెండింగ్ ఉందట. అందుకోసం పవన్ కళ్యాణ్ రెండు వారాల కాల్షీట్స్ ఇస్తే సరిపోతుందనేది ఫిల్మ్ నగర్ టాక్. మొత్తంగా ఈ రెండు సినిమాలకోసం పవన్ కళ్యాణ్ మూడు వారాల కాల్షీట్స్ కేటాయిస్తే ఈ చిత్రాలు థియేటర్లలోకి రావడానికి మార్గం సుగమం అయినట్టే.
-
Home
-
Menu