సివిల్ ఇంజనీర్ కథలో ట్విస్టులు

సివిల్ ఇంజనీర్ కథలో ట్విస్టులు
X
యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ ప్రస్తుతం హీరోగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’ సినిమాతో హీరోగా హిట్ కొట్టిన ప్రదీప్.. ఇప్పుడు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అంటూ మరో చిత్రంతో వస్తున్నాడు.

యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ ప్రస్తుతం హీరోగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’ సినిమాతో హీరోగా హిట్ కొట్టిన ప్రదీప్.. ఇప్పుడు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అంటూ మరో చిత్రంతో వస్తున్నాడు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై, జబర్దస్త్ ఫేమ్ డైరెక్టర్స్ నితిన్, భరత్‌ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రదీప్ కి జోడీగా దీపికా పిల్లి నటించింది.

లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. ట్రైలర్ చూస్తుంటే.. ఓ సివిల్ ఇంజనీర్ గ్రామీణ ప్రాంతానికి ప్రాజెక్ట్ కోసం వెళతాడు. అక్కడ అతను ఎదుర్కొన్న సవాళ్లు, గ్రామస్తులతో అనుభవించిన అనుభవాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఊరిలో ఒకే ఒక్క అమ్మాయి ఉండటం, ఆమె కథలో కీలక పాత్ర పోషించడం, ఆ అమ్మాయి చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? అన్న ప్రశ్నలు కుతూహలం రేకెత్తిస్తున్నాయి.

రదన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. మొత్తంగా ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఏప్రిల్ 11న 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రాబోతుంది.



Tags

Next Story