'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై ట్రోల్స్.. దిల్ రాజు సమాధానం!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనను పొందింది. ఈ చిత్రంపై విమర్శలు రావడంతో పాటు, తొలి రోజు వసూళ్లపై విడుదల చేసిన పోస్టర్ నమ్మదగినది కాదన్న విమర్శలు ఎదుర్కొంది. ఈ పోస్టర్‌కి సంబంధించి ఓ పాత్రికేయుడు దిల్ రాజును ప్రశ్నించగా 'మాకు వీక్‌నెస్‌లు, అబ్లిగేషన్స్ ఉంటాయి' అంటూ దిల్ రాజు కాస్త అస్పష్టమైన సమాధానం ఇచ్చారు.
తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా నిర్మాత దిల్‌రాజు.. ఈ సినిమా పంపిణీదారులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ గురించి తెలిపారు. ప్రస్తుతం పంపిణీదారుల సంఖ్య తగ్గిపోయినప్పటికీ, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విజయం అందర్నీ సంతృప్తిపరిచిందని ఆయన అన్నారు. మొత్తంగా.. ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్ల వివాదం కొనసాగుతుండగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రం భారీ లాభాలను అందించిందని స్పష్టమైంది.
-
Home
-
Menu