మెగా 157 తర్వాతే త్రివిక్రమ్!

మెగా 157 తర్వాతే త్రివిక్రమ్!
X
సంక్రాంతి బరిలో 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న వెంకటేష్.. ఇప్పటివరకూ కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించలేదు.

సంక్రాంతి బరిలో 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న వెంకటేష్.. ఇప్పటివరకూ కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. ఆమధ్య అమెరికాలో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నానని తెలిపాడు. ఇంకా.. చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీలోనూ కీలక పాత్రలో కనిపించనున్నానని క్లారిటీ ఇచ్చాడు.

తొలుత మెగా 157లో వెంకటేష్ షూటింగ్ పూర్తైన తర్వాతే త్రివిక్రమ్ సినిమాని ప్రారంభించనున్నాడట వెంకీ. అందుకే.. పట్టాలెక్కడం కాస్త ఆలస్యమైనా కంటిన్యూస్ షెడ్యూల్స్ లో సినిమాని ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట. అలా అక్టోబర్ నుంచి త్రివిక్రమ్ సినిమాని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట ఈ విక్టరీ హీరో.

వెంకటేష్-త్రివిక్రమ్ చిత్రానికి 'వెంకటరమణ, ఆనంద్ రావు’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో వెంకీకి జోడీగా త్రిషను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే వెంకీ-త్రిష కలయికలో వచ్చిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఓం నమో వెంకటేశాయ' చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.

Tags

Next Story