‘విశ్వంభర‘ నుంచి త్రిష లుక్!

‘విశ్వంభర‘ నుంచి త్రిష లుక్!
X
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మెగాస్టార్ కి కమ్ బ్యాక్ అవుతుందని మెగాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది.

‘స్టాలిన్‘ తర్వాత చిరు, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ఇదే. ఈరోజు (మే 4న) త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘విశ్వంభర‘ నుంచి త్రిష పోషిస్తున్న అవని పాత్రను పరిచయం చేస్తూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసింది టీమ్.

‘సృష్టి - స్థితి - లయ‘ అనే అంశాల చుట్టూ ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ వశిష్ట. చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి‘ తరహా ఫాంటసీ ఎలిమెంట్స్, ‘హిట్లర్‘ చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ ను ఈ మూవీలో మిళితం చేస్తున్నాడట.

‘విశ్వంభర‘ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుండడంతో అందుకు గానూ రూ.75 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ‘విశ్వంభర‘ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది. ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది టీమ్.



Tags

Next Story