కీరవాణి ఇంట్లో విషాదం

ప్రముఖ గేయ రచయిత, దర్శకుడు శివశక్తి దత్త (92) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణికి తండ్రిగా, రచయిత విజయేంద్రప్రసాద్ అన్నగా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి పెద్దనాన్నగా శివశక్తి దత్త తెలుగు సినీ కుటుంబంలో అందరికీ పరిచయం. గేయ రచయితగా ‘ఛత్రపతి, రాజన్న, బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాల్లోని 'మమతల తల్లి, ధీవర, సాహోరే బాహుబలి, రామం రాఘవమ్, అమ్మ అవని' వంటి పాటలు ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనాలు.
శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. చిన్ననాటి నుంచి కళలపై ఆసక్తితో ముంబై వెళ్లి చిత్రకారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, ‘కమలేశ్’ అనే పేరుతో చిత్రలేఖనంలో గుర్తింపు పొందారు. గిటార్, సితార్, హార్మోనియం వంటివాటిని నేర్చుకున్న ఆ తర్వాత సినిమారంగంలో రచయితగా అడుగుపెట్టారు.
1988లో ‘జానకిరాముడు’తో సినీ రచయితగా గుర్తింపు దక్కించుకున్నారు. 'చంద్రహాస్' సినిమాకి దర్శకత్వం వహించారు. ఇటీవల చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రానికి ఆయన గీతాలు రాశారని సమాచారం. శివశక్తి దత్త మృతితో టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
-
Home
-
Menu