ఇండియాలో టామ్ క్రూజ్ జోరు!

హాలీవుడ్లో అత్యంత విజయవంతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌లలో 'మిషన్ ఇంపాజిబుల్' ఒకటి. ఈ సిరీస్ లో లేటెస్ట్ గా 'ది ఫైనల్ రెకనింగ్' ఆడియన్స్ ముందుకొచ్చింది. మే 17న ఇండియాలో ఈ చిత్రం పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది. టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే సుమారు రూ.33 కోట్ల నెట్ వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
ట్రేడ్ వర్గాల ప్రకారం శనివారం, ఆదివారాలలో ఈ చిత్రానికి అత్యద్భుతమైన థియేటర్ ఆక్యుపెన్సీ కనిపించింది. ఫ్యాన్స్ ఎగబడి చూడటంతో ఈ సినిమా ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ సాధించిన టామ్ క్రూజ్ సినిమా అయ్యింది. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ చిత్రాలు 'కేసరి చాప్టర్ 2' వంటి సినిమాల తొలి రెండు రోజుల వసూళ్లను 'ది ఫైనల్ రెకనింగ్' దాటేయటం విశేషం.
62 ఏళ్ల వయసులోనూ టామ్ క్రూజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు, ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. లాంగ్ రన్ లో 'మిషన్ ఇంపాజిబుల్.. ది ఫైనల్ రెకనింగ్' ఇండియాలో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
-
Home
-
Menu