శర్వానంద్ చేతుల్లోకి ‘ఎల్లమ్మ’?

'బలగం' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత.. కమెడియన్ నుంచి పూర్తిగా డైరెక్టర్‌గా మారిపోయిన వేణు ఎల్దండి తన సమయాన్ని సద్వినియోగం చేసుకుని.. తెలంగాణ నేపథ్యంలో ఓ రూటెడ్ డ్రామాను రాసుకున్నాడు. ఈ సినిమాకు 'ఎల్లమ్మ' అనే ఎమోషనల్ టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇందులో ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా జోడించి.. కథాంశాన్ని మరింత ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దాడు.
మొదట్లో ఈ ప్రాజెక్ట్‌కు యంగ్ హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. టాప్ నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాను బ్యాంక్‌రోల్ చేస్తూ.. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తామని గ్రాండ్‌గా అనౌన్స్ చేశాడు. కానీ ఇక్కడే ఆయన ప్లాన్ అప్ సెట్ అయింది. ఆయన నిర్మించిన 'రాబిన్‌హుడ్, తమ్ముడు' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఈ డిజాస్టర్స్ తర్వాత దిల్ రాజు కాస్త కాంప్రమైజ్ అయ్యి.. 'ఎల్లమ్మ' ను ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌లో తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. కానీ, ఈ ఐడియా నితిన్‌కు అస్సలు నచ్చలేదట. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని నితిన్.. చివరికి ఈ ప్రాజెక్ట్ నుంచి సైలెంట్‌గా తప్పుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. అక్కడితో ఆగిపోయే టైప్ కాదు దిల్ రాజు. హీరో కోసం లాంగ్ సెర్చ్ మొదలు పెట్టాడు. చాలా రోజుల హంటింగ్ తర్వాత.. 'ఎల్లమ్మ' ప్రాజెక్ట్ ఇప్పుడు శర్వానంద్ చేతుల్లోకి చేరింది. శర్వానంద్ తో తనదైన స్టైల్‌లో ఈ సినిమా గురించి డిస్కస్ చేస్తున్నాడట దిల్ రాజు. కానీ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇండస్ట్రీలో శర్వానంద్‌కు ఓ స్పెషల్ రెప్యుటేషన్ ఉంది. తన రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తేనే, ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేసే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు ఇతర సినిమాలు ఉన్నాయి. అవన్నీ షూటింగ్‌లో వివిధ దశల్లో ఉన్నాయి. అతను 'ఎల్లమ్మ'కు ఓకే చెప్పినట్లయితే, ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే, అందరి కళ్లూ శర్వానంద్ నిర్ణయం మీదే ఉన్నాయి. ఈ ఎమోషనల్ డ్రామా ఎలా షేప్ అవుతుందో చూడాలి.
-
Home
-
Menu