నితిన్ ‘ఎల్లమ్మ’ షూటింగ్ అప్పటినుంచే !

యంగ్ హీరో నితిన్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమా కెరీర్లో వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. అతడి గత చిత్రం ‘రాబిన్‌హుడ్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమై.. తన కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో, నితిన్ తన కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌పై తీసుకొచ్చేందుకు కొత్త ప్రాజెక్ట్‌లపై ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ‘తమ్ముడు’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసాడు. ఈ చిత్రం జులై లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. ఇది ‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కనుంది.
‘ఎల్లమ్మ’ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నితిన్ జూన్ లో షూటింగ్ షెడ్యూల్‌కి డేట్స్ కేటాయించాడు. ఎల్లమ్మ తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఓ రూటెడ్ ఎమోషనల్ డ్రామాగా, హృదయాన్ని హత్తుకునే లవ్ స్టోరీతో కూడిన చిత్రంగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇటీవలే ఫైనలైజ్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది, ఇది నితిన్ కెరీర్లో ఓ సరికొత్త ప్రయోగంగా భావిస్తున్నారు.
బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు వేణు, ఎల్లమ్మ స్క్రిప్ట్ కోసం దాదాపు రెండేళ్లపాటు కష్టపడి పనిచేశాడు. ఈ సినిమా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, ఎమోషనల్ డెప్త్‌తో పాటు వినోదాన్ని అందించేలా రూపొందించారని తెలుస్తోంది. నితిన్ కెరీర్లో ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలవొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.
-
Home
-
Menu