యష్-నాని క్లాష్.. ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ!

యష్-నాని క్లాష్.. ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ!
X

ఈ ఏడాది ప్రథమార్థం ఇంకా పూర్తవ్వలేదు. అప్పుడు వచ్చే ఏడాదికి సంబంధించి ఆసక్తికర క్లాషెస్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీస్ లిస్టులో ‘ది ప్యారడైజ్‘ ఒకటి. ‘దసరా‘ వంటి సూపర్ హిట్ అందుకున్న నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న సినిమా ఇది.

ఇప్పటికే విడుదలైన ‘ది ప్యారడైజ్‘ గ్లింప్స్ కి, అందులో నాని నెవర్ బిఫోర్ మేకోవర్ కి చాలా మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘ది ప్యారడైజ్‘ చిత్రాన్ని 2026, మార్చి 26న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.

లేటెస్ట్ గా శాండల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమా ‘టాక్సిక్‘ రిలీజ్ డేట్ వచ్చింది. ‘టాక్సిక్‘ చిత్రాన్ని 2026, మార్చి 19న విడుదల చేయబోతున్నారు. అంటే నాని సినిమాకంటే ఒక వారం ముందుగానే ‘టాక్సిక్‘ ఆడియన్స్ ముందుకు రానుందన్నమాట.

‘కె.జి.యఫ్ 2‘ వంటి ఘన విజయం తర్వాత యష్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్ లో ‘టాక్సిక్‘పై అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ‘టాక్సిక్‘కి హిట్ టాక్ వస్తే.. నాని ‘ది ప్యారడైజ్‘ కలెక్షన్లపై అది ప్రభావం పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

Tags

Next Story