అల్లు- అట్లీ చిత్రం గురించి అదిరిపోయే అప్డేట్ !

ఇండియన్ మేకర్స్ కు హాలీవుడ్ టాలెంట్‌పై ఉన్న మక్కువ రోజురోజుకూ పెరుగుతోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫేమ్ జెరోమ్ ఫ్లిన్‌ను 'ఎల్2: ఎంపురాన్' కోసం పృధ్విరాజ్ సుకుమారన్ తీసుకొచ్చిన తరువాత.. ఎస్.ఎస్. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం 'రోమ్' నటుడు రే స్టీవెన్సన్‌ను ఎంపిక చేసిన వార్తలు దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థాయిని మించిన ఓ భారీ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాకు ఆస్కార్ విజేత విల్ స్మిత్‌ను సంప్రదించనున్నారట.
ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా ఏఏ22 x ఏ6గా పిలుస్తున్నారు. ఇది అల్లు అర్జున్‌కు 22వ చిత్రం కాగా.. అట్లీకి 6వ దర్శకత్వ చిత్రం. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే బీహైండ్ ద సీన్స్ వీడియో ద్వారా మేకర్స్.. టాప్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్‌ను చూపించారు. దీంతో ఫ్యాన్స్ తెగ ఎగ్జయిట్ అయిపోతున్నారు. ‘మెన్ ఇన్ బ్లాక్’, ‘అలీ’, ‘ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపినెస్’ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన విల్ స్మిత్ ఇటీవల అంతర్జాతీయ ప్రాజెక్ట్స్‌లో కనిపించలేదు. కానీ ఈ రూమర్ నిజమైతే.. ఆయన భారతీయ సినిమాలో నటించడం క్రాస్-కాంటినెంటల్ సినిమాకే కొత్త దారులు వేయనుంది.
ప్రస్తుతం 56 ఏళ్ల వయసున్న విల్ స్మిత్‌కి.. ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. ఈ పాత్ర, చిత్ర కథలో ఓ కీలక మలుపుగా ఉంటుందట. అంతేగాక, అంతర్జాతీయంగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఈ పాత్రకు ఉందని భావిస్తున్నారు. విల్ స్మిత్ ఒక భారతీయ సినిమాలో నటిస్తే, అది కేవలం రూమర్‌గానే మిగలకుండానే ఒక చరిత్రాత్మక కాంబినేషన్‌గా నిలవొచ్చు. ఇది నిజమైతే, భారతీయ సినిమా మరో అంతర్జాతీయ గీతను దాటినట్లే.
-
Home
-
Menu