2024 దీపావళి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

2024 దీపావళి తెలుగు బాక్స్ ఆఫీస్‌కి బాగా కలిసొచ్చింది. ఆ సమయంలో విడుదలైన మూడు సినిమాలు... దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’, కిరణ్ అబ్బవరం ‘క’ , శివకార్తికేయన్ ‘అమరన్’.. ఒకే సమయంలో రిలీజ్ అయిన ప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడిచాయి. ఇప్పుడు 2025 దీపావళి సీజన్‌లో కూడా పెద్ద సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. కానీ, 2024 దీపావళి మ్యాజిక్‌ని రిపీట్ చేయగలవా అనేది ఆసక్తిగా మారింది.
ప్రదీప్ రంగనాథన్.. ఈ ఏడాది ‘డ్రాగన్’ తో హిట్ కొట్టిన తర్వాత, దీపావళికి ‘డ్యూడ్’ అనే రొమాంటిక్ కామెడీతో వస్తున్నాడు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. గత ఏడాది దీపావళికి ‘క’ మూవీతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ఈ దీపావళికి ‘కే-ర్యాంప్’ మూవీతో వస్తున్నాడు. లేటెస్ట్ గా మేకర్స్ అధికారికంగా ‘కే-ర్యాంప్’ దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతుందని ప్రకటించారు.
సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘తెలుసుకదా’ కూడా దీపావళికి వస్తుందని కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. నీరజ కోన డైరెక్షన్‌లో వస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వీటితో పాటు, కార్తి ‘సర్దార్ 2’ లేదా సూర్య ‘కరుప్పు’ మూవీస్ కూడా దీపావళి సమయంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సూర్య, కార్తి సోదరులు కాబట్టి, వీరిలో ఒకరి సినిమా మాత్రమే దీపావళికి వస్తుంది, మరొకటి తర్వాతి తేదీకి షిఫ్ట్ అవుతుంది. మొత్తంగా, ఈ ఏడాది దీపావళికి బోలెడు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. 2024 దీపావళి సినిమాల సక్సెస్‌ని ఇవి రిపీట్ చేస్తాయా అనేది చూడాలి.
-
Home
-
Menu