బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఎప్పటి నుంచి?

బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఎప్పటి నుంచి?
X

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ అంటే ఓ సూపర్ హిట్ కాంబినేషన్ గుర్తుకొస్తుంది. వీరి కలయికలో వచ్చిన 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో' మూడూ విజయాలు సాధించాయి. ఇప్పుడు వీరిద్దరూ తమ కాంబోలో నాల్గవ సినిమాకోసం సిద్ధమవుతున్నారు.

అయితే త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అట్లీతో చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు అల్లు అర్జున్. బన్నీ-అట్లీ కాంబో మూవీ పూర్తయ్యే వరకూ త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం కాదట. 2026లో బన్నీ-త్రివిక్రమ్ సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అంటే.. ‘గుంటూరు కారం‘ తర్వాత రెండేళ్ల గ్యాప్ తో మాటల మాంత్రికుడు కొత్త సినిమాని మొదలు పెట్టనున్నాడన్నమాట.

మరోవైపు 'పుష్ప 2'తో పెరిగిన అల్లు అర్జున్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. స్కంద పురాణం ఆధారంగా ఓ మైథలాజికల్ స్టోరీని సిద్ధం చేస్తున్నాడట గురూజీ. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ ఓ మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందట.

Tags

Next Story