ఒక పోరి పోరడిలా ప్రేమిస్తే ఎలా ఉంటది?!

ఒక పోరి పోరడిలా ప్రేమిస్తే ఎలా ఉంటది?!
X

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ వద్ద ‘రంగస్థలం‘ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. ‘దసరా‘తో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటివరకూ కేవలం ఒక సినిమానే ప్రేక్షకుల ముందు నిలిపినా.. ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్‘, మెగాస్టార్ చిరంజీవితో మరో చిత్రాన్ని లైన్లో పెట్టి ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాడు.





టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నాడు. సమ్మక్క సారక్క క్రియేషన్స్ మొదలు పెట్టి మొదటి ప్రయత్నంగా ఓ వినూత్న ప్రేమకథ ‘గులాబీ‘ని తీసుకొస్తున్నాడు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రతో కలిసి శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చేతన్ బండి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ‘గులాబీ‘ అంటూ షార్ట్ ఫామ్ లో పిలిచినా.. ఈ మూవీకి ‘అల్ అమినా జారియా రుక్సానా గులాబీ‘ అంటూ ఓ వినూత్న టైటిల్ ను ఖరారు చేశారు. 2009లో గోదావరిఖనిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.

ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నలుపు చీరలో ఓ మహిళ నడుస్తుండగా, చుట్టూ ఎర్ర గులాబీలు రాలిపోతున్న తీరుగా చూపించారు. ప్రేమ, విషాద భావోద్వేగాలు ఉట్టిపడేలా ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ‘ఒక పోరి పోరడిలా ప్రేమిస్తే ఎలా ఉంటది?!‘ అంటూ ఈ మూవీ స్టోరీ లైన్ ను కూడా చెప్పే ప్రయత్నం చేశాడు ప్రొడ్యూసర్ శ్రీకాంత్ ఓదెల.

Tags

Next Story