నాగ్ నెక్స్ట్ మూవీ ఏంటి?

నాగ్ నెక్స్ట్ మూవీ ఏంటి?
X

కింగ్ నాగార్జున తదుపరి ప్రాజెక్టుపై ఉత్కంఠ పెరుగుతోంది. నా సామి రంగ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున.. ఇంకా కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, రజనీకాంత్ ‘కూలీ’, ధనుష్ ‘కుబేరా’ వంటి సినిమాల్లో శక్తివంతమైన అతిథి పాత్రలు చేస్తున్నారు. కొంతకాలంగా కోలీవుడ్ యువ దర్శకుడు నవీన్ దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం.

అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాకపోవడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉందట. తాజా సమాచారం ప్రకారం.. నాగార్జున కథ విషయంలో సంతృప్తిగా లేరట. కథలో ఆయన సూచించిన మార్పులను నవీన్ సమర్ధవంతంగా అమలు చేయలేకపోతున్నాడని తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు అందరి దృష్టి నాగార్జున తీసుకునే నిర్ణయంపైనే ఉంది. నవీన్ కథను సిద్ధం చేసేవరకు వేచిచూడాలా? లేక కొత్త దర్శకుడిని తీసుకురావాలా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు రచయిత ప్రసన్న కుమార్ దర్శకత్వంలో నాగార్జున ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అయితే, ఆ కథపై నాగార్జున అసంతృప్తిగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ఇప్పుడు అదే పరిస్థితి నవీన్ ప్రాజెక్ట్ విషయంలోనూ ఏర్పడిందని అనిపిస్తోంది. ప్రస్తుతం నాగార్జున రజనీకాంత్ కూలీ చిత్రంలో తన పాత్రను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాతే తన సొంత సినిమా విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story