RC 16 తర్వాత చెర్రీ సినిమా ఏంటి?

రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా ఆర్సీ 16 గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. చరణ్ తదుపరి సినిమా గురించి పరిశ్రమలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇదివరకే అనౌన్స్ అయినప్పటికీ.. సుకుమార్ సినిమాలకు అధిక సమయం పడుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. దీంతో బుచ్చిబాబు సినిమా పూర్తి చేసేలోపే మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాలని చరణ్ ఆలోచనలో ఉన్నాడని టాక్.
ఈ నేపథ్యంలో.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన రామ్ చరణ్ కోసం ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మధు మంతెన బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఫాంటమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా.. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ కూడా ఓ బాలీవుడ్ దర్శకుడితో పని చేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
అయితే మధు మంతెన ఇంకా దర్శకుడు లేదా కథను ఫైనలైజ్ చేయలేదు. కానీ రామ్ చరణ్ అంగీకరిస్తే.. ఈ ప్రాజెక్ట్‌కు రూపురేఖలు తీసుకురావడానికి మధు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ బాలీవుడ్ మార్కెట్‌ను టచ్ చేసే సినిమా రూపంలో ఇది చరణ్‌కు మరో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా దర్శకుడు ఎవరవుతారు? కథ ఎలా ఉంటుంది? అనే విషయాలపై మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
-
Home
-
Menu