త్వరలో పెళ్ళిపీటలెక్కబోతున్న అల్లు శిరీష్?

త్వరలో పెళ్ళిపీటలెక్కబోతున్న అల్లు శిరీష్?
X
తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తెతో అతడి పెళ్లి ఇటీవల ఖరారైందని వినికిడి.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు అల్లు శిరీష్ నటుడిగా చాలాసార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ, అతడి సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. మధ్యలో కొన్ని బ్రేక్స్ తీసుకుని తిరిగి వచ్చినా విజయాన్ని చవి చూడలేకపోయాడు. అతడు చివరిగా 'బడ్డీ' చిత్రంలో కనిపించాడు. ఇటీవల ఈ హీరో ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే.

ఇటీవల జరిగిన కొన్ని సినీ కార్యక్రమాలలో అల్లు శిరీష్ వివాహం గురించి చర్చ జరిగింది అయితే ఈ హీరో అధికారికంగా దేన్నీ ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తెతో అతడి పెళ్లి ఇటీవల ఖరారైందని వినికిడి.

ఇరు కుటుంబాలు కలుసుకుని వివాహం గురించి చర్చించారని తెలుస్తోంది. అయితే, అల్లు అరవింద్‌ తల్లి అల్లు కనకరత్నం గారి ఆకస్మిక మరణంతో పెళ్లి పనులు వాయిదా పడ్డాయి. సరైన సమయంలో అల్లు శిరీష్ ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. ఇతర మెగా హీరోలైన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి తరచుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story