వార్నర్ క్యామియో.. పారితోషికం ఎంతంటే?

వార్నర్ క్యామియో.. పారితోషికం ఎంతంటే?
X

ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్, యాక్టింగ్ వంటి విషయాలపై ఆసక్తి చూపించడం కొత్త విషయం కాదు. కరోనా కాలంలో టిక్‌టాక్‌లు, రీల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వార్నర్, 'రాబిన్‌హుడ్'తో సిల్వర్ స్క్రీన్ పైనా సందడి చేయబోతున్నాడు.

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'రాబిన్‌హుడ్' చిత్రంలో వార్నర్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. మొదట ఈ విషయంపై ఉహాగానాలు వచ్చినా, ఇటీవల నిర్మాత రవిశంకర్ దీనిని అధికారికంగా ప్రకటించారు.

ఇక 'రాబిన్‌హుడ్'లో తాను పోషించిన పాత్రకోసం వార్నర్ ఎలాంటి పారితోషికం తీసుకున్నాడనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ నిర్మాతలు అతనికి రూ.50 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.

మరోవైపు డేవిడ్ వార్నర్ 'రాబిన్‌హుడ్' తర్వాత టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. 'రాబిన్‌హుడ్' చిత్రం మార్చి 28న థియేటర్లలోకి రాబోతుంది.

Tags

Next Story