సూర్య - వెంకీ అట్లూరి చిత్రానికి టైటిల్ ఇదేనా?

సూర్య - వెంకీ అట్లూరి చిత్రానికి టైటిల్ ఇదేనా?
X
ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. అయితే సోషల్ మీడియాలో 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ చక్కర్లు కొడుతోంది.

టాలెంటెడ్ తమిళ స్టార్ హీరో సూర్య, చాలా కాలం తర్వాత స్ట్రైట్ తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. 'సర్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో గుర్తింపు పొందిన వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో లోడెడ్ అయ్యే ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.

ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. అయితే సోషల్ మీడియాలో 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సూర్యకు ఈ సినిమా కోసం 50 కోట్ల రూపాయల పారితోషికం అందుతోందని, మొత్తం చిత్రానికి 120 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.

సితార ఎంటర్టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు రికార్డు ధరకు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story