'విశ్వంభర & వీరమల్లు'.. విడుదల ఎప్పుడు?

విశ్వంభర & వీరమల్లు.. విడుదల ఎప్పుడు?
X

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మెగా బ్రదర్స్ ఇద్దరి సినిమాలకు ఇప్పుడు ఒకలాంటి సవాళ్లే ఎదురవుతున్నాయి. చిరంజీవి 'విశ్వంభర', పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' విడుదల తేదీలు నిర్ధారణ కావడం ఆలస్యం అవుతోంది.

'విశ్వంభర' విషయంలో టీజర్ వచ్చినప్పటి నుంచి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో మేకర్స్ రిలీజ్ గురించి ఎలాంటి హడావుడి లేకుండా అవుట్‌పుట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. మొదట సంక్రాంతి సీజన్‌ని టార్గెట్ చేసిన ఈ సినిమా ఇప్పుడేమో జూన్ తర్వాతే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో 'హరిహర వీరమల్లు' సినిమా నాలుగేళ్లుగా ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉంది. దర్శకుడు జ్యోతి కృష్ణ సినిమా పూర్తి చేసేందుకు కొద్దిరోజుల కాల్‌షీట్లు కావాలని ఎదురు చూస్తున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్ వల్ల అది కుదరడం లేదు. ఈనెలలో 28న ఎట్టిపరిస్థితుల్లోనే 'వీరమల్లు'ని తీసుకొద్దామని ప్లాన్ చేసినా.. ఆ తేదీ కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఏప్రిల్ లేదా మేలో 'హరిహర వీరమల్లు'ని తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్

Tags

Next Story