మంచు విష్ణు.. మైక్రో డ్రామాస్ ప్రాజెక్ట్

‘కన్నప్ప’ సినిమా సక్సెస్ తర్వాత.. హీరో-నిర్మాత విష్ణు మంచు ఊహించని అడుగుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడు కొత్త వెంచర్ కోసం రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ పేరు మైక్రోడ్రామాస్. సోషల్ మీడియా షార్ట్ క్లిప్స్ కు భిన్నంగా, మైక్రోడ్రామాస్ అనేవి 3 నుంచి 7 నిమిషాల నిడివి గల హై-క్వాలిటీ, బిగుతైన స్క్రిప్ట్ తో రూపొందిన ఎపిసోడ్స్.
ఇవి మొబైల్ వీక్షణ కోసం రూపొందించబడ్డాయి, కానీ ప్రొఫెషనల్ ఫిల్మ్‌మేకింగ్ స్థాయిని కలిగి ఉంటాయి. విష్ణు తన సొంత నిధులతో పాటు బయటి ఈక్విటీని కూడా పెట్టుబడిగా పెట్టాడని తెలుస్తోంది. ఇది ఈ ఫార్మాట్ పట్ల అతడికున్న నమ్మకాన్ని చాటుతోంది.
‘కన్నప్ప’ సినిమాతో వచ్చిన గుర్తింపు తర్వాత, విష్ణు కేవలం నటుడిగానే కాకుండా, దూరదృష్టి గల వ్యవస్థాపకుడిగా కూడా విష్ణు మారాడు. మరి ఈ మైక్రో డ్రామాస్ జనంలోకి ఏ రేంజ్ లో దూసుకెళ్తాయో, సోషల్ మీడియాలో ఎంత వేగంగా వైరల్ అవుతాయో చూడాలి.
-
Home
-
Menu