‘కన్నప్ప’ వెనుక కష్టం వివరించిన విష్ణు!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఎపిక్ మూవీని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తీసుకొస్తున్నారు.
ఈ మూవీలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి అగ్రశ్రేణి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో 'కన్నప్ప' టీమ్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది.
తాజాగా మంచు విష్ణు 'కన్నప్ప' మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో 24 క్రాఫ్ట్స్‌ను సమన్వయం చేసుకుంటూ సినిమా కోసం చేసిన విశ్లేషణలు, అంకితభావంతో జరిగిన పనితీరును చూపించే ప్రయత్నం చేశారు. అవా ఎంటర్టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై 'మహాభారత్' ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు
-
Home
-
Menu