వైరల్ క్లిక్.. మెగా స్టిల్ ముందు మాస్టర్ మైండ్స్!

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'తో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. చేసింది మూడు సినిమాలే అయినా సందీప్ సంపాదించిన క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సందీప్ కి మాత్రం ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలనేది కోరిక.
చిన్నప్పటి నుంచే చిరంజీవికి వీరాభిమాని సందీప్ రెడ్డి వంగా. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు. ఇక ఈమధ్య తన ప్రొడక్షన్ హౌజ్ 'భద్రకాళి పిక్చర్స్' ఆఫీసులో మెగాస్టార్ చిరంజీవిది పెద్ద ఫోటో ఫ్రేము పెట్టించుకున్నాడు. 'ఆరాధన' సినిమాలోని ఈ ఫోటో సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండింగ్ అయ్యిందో తెలిసిందే.
లేటెస్ట్ గా భద్రకాళి పిక్చర్స్ ఆఫీసులోని ఈ మెగా ఫోటో పక్కన సందీప్ రెడ్డి వంగాతో పాటు మెగా వారసుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు కూడా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. సందీప్ రెడ్డి, బుచ్చిబాబు ఇద్దరూ ‘ఆరాధన‘ మెగాస్టార్ స్టిల్ కి అటూ, ఇటూ నిలబడిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
-
Home
-
Menu