సీక్వెల్ లోనూ వర్మ ఉంటాడా?

సీక్వెల్ లోనూ వర్మ ఉంటాడా?
X
'జైలర్‌ 2'లోనూ వినాయకన్‌ను కొన్ని నిమిషాల పాటు చూపించేందుకు మేకర్స్ నిర్ణయించారు. 'జైలర్‌' లో వర్మ చనిపోయినట్లు చూపించినప్పటికీ, దర్శకుడు నెల్సన్ ఫ్లాష్‌బ్యాక్ సీన్ ద్వారా వర్మ పాత్రను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో 'జైలర్‌' సినిమా కీలకమైన మైలురాయిగా నిలిచింది. రజనీకాంత్ కెరీర్ సమాప్తమైందనే ప్రచారం జోరుగా సాగిన సమయంలో విడుదలైన 'జైలర్‌' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, సునామీలా వసూళ్లను రాబట్టింది. ఈ విజయంతో రజనీకాంత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు నిరూపించుకొని, వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. 'జైలర్‌' సూపర్‌ హిట్‌ నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు. రజనీకాంత్ కూడా 'జైలర్‌' విజయం పట్ల ఉత్సాహంతో సీక్వెల్‌కు ఆమోదం తెలిపి, షూటింగ్‌ను వేగవంతం చేశారు.

'జైలర్‌ 2' షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇటీవల తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా 10 నిమిషాల పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ పాత్ర కోసం బాలకృష్ణ రికార్డ్ స్థాయి పారితోషికం డిమాండ్ చేసినట్లు, ఆయన ఫామ్‌ మరియు పాత్ర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ జరగనుందని సమాచారం. రజనీకాంత్‌, బాలకృష్ణ కాంబో సన్నివేశాలు ఉంటాయా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇక 'జైలర్‌' చిత్రం లో వర్మ పాత్రలో మెయిన్ విలన్ వినాయకన్ నటన అందరినీ ఆకట్టుకుంది. రజనీకాంత్‌తో ఆయన సన్నివేశాలు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. సినిమా విజయంలో వినాయకన్ పాత్ర కీలకంగా నిలిచింది. అందుకే 'జైలర్‌ 2'లోనూ వినాయకన్‌ను కొన్ని నిమిషాల పాటు చూపించేందుకు మేకర్స్ నిర్ణయించారు. 'జైలర్‌' లో వర్మ చనిపోయినట్లు చూపించినప్పటికీ, దర్శకుడు నెల్సన్ ఫ్లాష్‌బ్యాక్ సీన్ ద్వారా వర్మ పాత్రను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వినాయకన్ ఇప్పటికే రెండు రోజుల షూటింగ్‌లో పాల్గొన్నారు. మరో రెండు లేదా మూడు రోజులు పాల్గొనే అవకాశం ఉంది.

Tags

Next Story