విక్రమ్ ‘వీర ధీర శూర’ టిజర్!

విలక్షణ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీర ధీర శూర పార్ట్ 2’. అసలు ఒక సినిమాకి ఫస్ట్ పార్ట్ రిలీజైన తర్వాత సెకండ్ పార్ట్ తీసుకొస్తారు. కానీ ఈ చిత్రాన్ని సెకండ్ పార్ట్ తో మొదలు పెట్టడం విశేషం. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు టీజర్ రిలీజ్ అయ్యింది.
టీజర్ లో విక్రమ్ రూరల్ లుక్ లో అదరగొడుతున్నాడు. ఇతర కీలక పాత్రల్లో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ కనిపిస్తున్నారు. జి. వి.ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్. మొత్తంగా టీజర్ చూస్తుంటే ఈ మూవీ ఆడియెన్స్ కి అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందనే అంచానాలు పెరుగుతున్నాయి. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించిన ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్ గా విడుదలకు ముస్తాబవుతుంది. ఎన్.వి.ఆర్. సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుంది.
-
Home
-
Menu