ఈ సూపర్ కాంబో ఖాయమేనా?

ఈ సూపర్ కాంబో ఖాయమేనా?
X
యంగ్ స్టార్ విజయ్ దేవరకొండతో కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. గత కొన్ని వారాలుగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

డైరెక్టర్ హరీష్ శంకర్.. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా దాదాపు పూర్తయిన నేపథ్యంలో.. హరీష్ ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండతో కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. గత కొన్ని వారాలుగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

హరీష్ ఈ ఏడాది చివరి నాటికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీని పూర్తి చేయాలనే టార్గెట్ తో ఉన్నాడు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో ప్రాజెక్ట్‌లకు కమిట్ అయ్యాడు. మరోవైపు.. హరీష్ శంకర్ ప్రొడ్యూసర్ ఎస్. నాగ వంశీతో చర్చలు జరుపుతున్నాడు. ఈ సినిమాని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే అవకాశం ఉంది.

అలాగే.. హరీష్ శంకర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి పని చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఆ సినిమా నిర్మాణ సంస్థ ఇంకా ఖరారు కాలేదు. విజయ్ దేవరకొండకి హరీష్ శంకర్‌తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. హరీష్ విజయ్ తన కమిట్‌మెంట్స్ పూర్తి చేసే వరకు వెయిట్ చేస్తాడా లేక మరో ప్రాజెక్ట్ తీసుకుంటాడా అనేది చూడాలి.

Tags

Next Story