విజయ్ దేవరకొండ - విక్రమ్ కె కుమార్ కాంబో?

విజయ్ దేవరకొండ - విక్రమ్ కె కుమార్ కాంబో?
X
విజయ్ దేవరకొండ.. సెన్సిబుల్ సినిమాలు తీసే డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. రీసెంట్‌గా డైరెక్టర్ విజయ్‌కి ఒక స్టోరీ నెరేట్ చేశారట. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో విజయ్ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎర్లియర్ సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. 'కింగ్‌డమ్' బాగానే స్టార్ట్ అయినా.. తర్వాత కొంచెం స్లో అయింది. ఆపై డిజాస్టర్ గా తేలిపోయింది. అయితే.. విజయ్ ఆల్రెడీ రెండు కొత్త సినిమాలు అనౌన్స్ చేశాడు. ఒకటి 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్‌తో, ఇంకొకటి 'రాజా వారు రాణి గారు' ఫేమ్ రవి కిరణ్ కోలాతో.

లేటెస్ట్ సినీ టాక్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ.. సెన్సిబుల్ సినిమాలు తీసే డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. రీసెంట్‌గా డైరెక్టర్ విజయ్‌కి ఒక స్టోరీ నెరేట్ చేశారట. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో విజయ్ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు.

యాక్చువల్‌గా.. విక్రమ్ కె. కుమార్ ఇంతకుముందు నితిన్‌తో ఒక పెద్ద స్పోర్ట్స్ డ్రామా చేయాలనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు డ్రాప్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విజయ్- విక్రమ్ కె. కుమార్ కాంబోలో సినిమా వస్తే.. అది నితిన్‌కి చెప్పిన స్క్రిప్టేనా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. మరి విక్రమ్ కె కుమార్ .. విజయ్ దేవరకొండతో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.

Tags

Next Story